తెలుగు రాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్యం రెండు ఆసుప‌త్ర‌ల్లో అందుతుంద‌ని నీతి ఆయోగ్ నివేదికలో వెల్ల‌డించింది.పుట్ట‌ప‌ర్తిలోని స‌త్య‌సాయి ఆసుప‌త్రితో పాటు హైద‌రాబాద్ లోని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్యం ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న‌ట్లు పేర్కొంది.అయితే బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని నీతి ఆయోగం ప్ర‌క‌టించ‌డం ఎంతో ఆనందానిచ్చింద‌ని మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. క్యాన్స‌ర్ ట్రీట్మెంట్‌కి అత్యాధునిక వైద్య స‌దుపాయాల‌తో ఆసుప‌త్రి ఉండాల‌న్న స‌ర్వీయ నంద‌మూరి తార‌క‌రామారావుగారి ఆశ‌యం నెర‌వేరంద‌ని లోకేష్ పేర్కొన్నారు.బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి నేడు కొన్ని ల‌క్ష‌ల మంది ప్రానాలను కాపాడుతోంద‌ని...త‌క్కువ ఖ‌ర్చుతో మెరుగైన వైద్యం అందించ‌డాన‌కి స‌హాయం చేస్తున్న దాత‌ల‌కు,ఆసుప‌త్రిని విలువల‌తో న‌డుపుతున్న ఛైర్మ‌న్ బాలామామాకి,వైద్యులు,సిబ్బందికి అభినంద‌న‌లు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.బాల‌కృష్ణ నేతృత్వంలో క్యాన్స‌ర్ ఆసుప‌త్రి అద్భుతంగా న‌డుస్తుందంటూ అల్లుడు లోకేష్ ప్ర‌శంస‌లు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: