హైదరాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో చిల్ల‌ర లోపాలు పోవాలంటే మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్నారు మాజీ హెచ్‌సీఏ అధ్య‌క్షుడు గ‌డ్డం వినోద్‌కుమార్‌.హెచ్‌సీఏకి 80 ఏళ్ల చ‌రిత్ర ఉంద‌ని..ఇప్పుడు అది నాశ‌న‌మైపోయింద‌న్నారు.హెచ్‌సీఏ ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉందన్నారు. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌లో 218 క్ల‌బ్‌లు ఉన్నాయ‌ని...అందులో ఉన్న వారికి ఎప్పుడు మ‌నస్ప‌ర్థ‌లు ఉంటాయ‌ని గ‌డ్డం వినోద్‌కుమార్ తెలిపారు.గ‌తంలో ఐసీసీ ఛాంపియ‌న్ షిప్‌కోసం తాను ఎంతగానో కృషి చేశాన‌ని ప్రెసిడెంట్‌గా ఉన్న స‌మ‌యంలో అంద‌రిని కూర్చోబెట్టి ప‌రిస్థితులు చ‌క్క‌బెట్టాన‌ని ఆయ‌న తెలిపారు.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు హెచ్‌సీఏకి ఐదు ఎక‌రాల ల్యాండ్ ఇప్పించాన‌ని..స్టేడియం నిర్మాణానికి 4.5 కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని ఆయ‌న తెలిపారు.క్రికెట్ అభివృద్ధి కోసం తాము ఎప్పుడూ ముందుంటామ‌ని...ప్ర‌స్తుతం హెచ్‌సీఏలో జ‌రిగే ప‌రిణామాలు చూస్తుంటే బాధేస్తుంద‌న్నారు.అజార్, అపెక్స్ కౌన్సిల్ కూర్చొని మాట్లాడుకోవాలి లేదా ఉన్న బాడీలు డిజల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

HCA