ఏపీ సిఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది ఏంటీ అనే దానిపై అందరూ కూడా కాస్త ఆసక్తికరంగా చూస్తున్నారు. బెయిల్ రద్దు పిటీషన్ ను వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు దాఖలు చేయగా నేడు అది సిబిఐ కోర్ట్ లో విచారణకు రానుంది. ఇప్పటికే లిఖితపూర్వక వాదనలను కోర్ట్ కు పిటిషనర్ రఘురామ కృష్ణం రాజు అలాగే వైఎస్ జగన్ తరుపు న్యాయవాదులు సమర్పించారు.

లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ నిరాకరించింది.  లిఖితపూర్వక వాదనలు పై నేడు సీబీఐ కోర్ట్ విచారణ జరపనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి టీడీపీ నేతలు కూడా కాస్త ఆసక్తికరంగా చూస్తున్నారు. రఘురామ తరుపు లాయర్లతో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఏ మలుపు తిరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: