ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఆయన పదే పదే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం సంచలనం అయింది. ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రిని కలిసారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంకు అప్పు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ బుగ్గన ఢిల్లీ వెళ్ళడానికి వచ్చే నెల కోసమే అని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

వచ్చే నెల జీతాలను వేగంగా ఇవ్వడానికి గానూ... ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పలువురు కేంద్ర మంత్రులను,కేంద్ర కార్యదర్శలను కలవనున్న బుగ్గన రాజేంద్రనాధ్... 3 గంటలకు నీతి ఆయోగ్ సభ్యుడు అవినాష్ మిశ్రా ను  కలిసే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: