తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నారు. కీలక నాయకుల నుంచి సహకారం రాకపోయినా సరే ఆయన మాత్రం స్పీడ్ గా పార్టీ కోసం వ్యూహాలు సిద్దం చేసి ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. మన ఉద్యోగాలు మనగ్గావాలన్న ఉద్యమ ఆకాంక్షకు టీఆర్ఎస్ సర్కారు తూట్లు పొడిచింది అని ఆయన ఆరోపణలు చేసారు.

కేసీఆర్ పాలనలో గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్యాయం అనేక రెట్లైంది అని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్ లో మన బిడ్డల పట్ల వివక్షే దీనికి మరో నిదర్శనం అని అన్నారు రేవంత్. ఈ ఆందోళనలు  తుది దశ ఉద్యమ సంకేతాలు అంటూ వ్యాఖ్యలు చేసారు. సిద్ధంగా ఉండు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: