'పెగాసస్ స్పైవేర్‌' ప్రస్తుతం ఈ పేరు మాత్రమే ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇజ్రాయిల్ కు చెందిన ఎన్‌ఎస్‌ఓ తమ దేశంలోని పార్లమెంట్ సభ్యులు ప్రతిపక్ష నేతలు అలాగే ప్రముఖ జర్నలిస్టుల పై గూఢచర్యం చేయడానికి పెగాసస్ స్పైవేర్‌ వాడినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంపై పార్లమెంటు లో ప్రతిపక్షాలు ఉభయ సభలను స్థంబింపచేశాయి. తాజాగా టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్‌ దురోవ్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. గూగుల్, ఆపిల్ లాంటి కంపెనీలు ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉండడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. గూగుల్, ఆపిల్ కంపెనీ లు ప్రభుత్వాలకు, కొన్ని నియంత్రణ సంస్థలకు తమ యూజర్ల డాటాను అందిస్తున్నాయని, దానివల్ల యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని అంతేకాదు వీటినీ థర్డ్ పార్టీ సంస్థలు తప్పుగా వాడుకునే అవకాశం కూడా ఉందని దుయ్యబట్టారు. ఇందుకు ఉదాహరణగా పెగాసస్ స్పైవేర్‌ చక్కని ఉదాహరణ అని చెప్పారు దురోవ్‌.  ప్రపంచవ్యాప్తంగా గూగుల్ మరియు ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండటం వల్ల అందరికి ఈ రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అందుకే ఈ సమస్య వస్తుందని దురోవ్‌ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: