టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా ట్విట్టర్ కారణంగా చర్చల్లో నిలిచారు. ధోనీ ఖాతా నుండి ట్విట్టర్ తాత్కాలికంగాసెలెబ్రిటీలకు మాత్రమే ఉండే బ్లూ టిక్‌ను తీసివేసింది. ధోనీ ఖాతా నుండి బ్లూ టిక్‌ను తొలగించాలని ట్విట్టర్ ఎందుకు నిర్ణయించుకుంది అనేది తెలియరాలేదు. కానీ కొన్ని గంటల తరువాత ధోనీ ట్విట్టర్ ఖాతాకు మళ్లీ నీలిరంగు టిక్ మార్క్ వచ్చి చేరింది. కానీ ఇప్పటికీ ధోనీ ట్విట్టర్ నుండి బ్లూ టిక్‌ను తొలగించిన విషయం ట్రెండ్ అవుతోంది. ధోనీ ట్విట్టర్ అకౌంట్ నుండి బ్లూ టిక్ తీసివేయడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ధోనీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి కారణమేంటని వారు ట్విట్టర్ ను నిలదీస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో ధోనీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అప్పటి నుండి అతను ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అంతకు ముందు అతను సెప్టెంబర్ 2020లో చివరి ట్వీట్ చేసాడు. అంటే భారత మాజీ కెప్టెన్ చేసిన ఒక ట్వీట్‌కు మరొకటి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఆయన ట్విట్టర్ లో యాక్టివ్ గా లేకపోవడం దృష్ట్యా ట్విట్టర్ అతని ఖాతా నుండి బ్లూ టిక్‌ను తీసివేసిందని కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి ఆ బ్లూ మార్క్ మళ్ళీ రావడంతో ధోనీ ఫ్యాన్స్ శాంతించారు. లేదంటే రచ్చ మరోలా ఉండేది.  


మరింత సమాచారం తెలుసుకోండి: