హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెను ప్రమాదం జరిగింది. ఇక్కడ కొండచరియలు విరిగిపడడంతో, బస్సు నిండిన ప్రయాణికులు శిథిలాల్లో చిక్కుకున్నారు. బస్సు కోసం అన్వేషణ కొనసాగుతోంది. అంతే కాకుండా అనేక వాహనాలు కూడా శిధిలాల కింద చిక్కుకున్నాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు నిర్ధారించగా, 14 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో 50 నుంచి 60 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఎర్త్ మూవర్ యంత్రాల ద్వారా చెత్తను తొలగిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న బస్సులో 25 మందికి పైగా ఉన్నట్లు భావిస్తున్నారు. వారిని రక్షించడానికి 2 గంటల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. 300 మంది ఐటిబిపి సిబ్బంది రెస్క్యూలో నిమగ్నమై ఉన్నారు. ఈ దిగ్భాంతికర ఘటన గురించి ప్రధానమంత్రి మోడీ హిమాచల్ ప్రదేశ్ సీఎంను ఆరా తీశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: