ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. మంగ‌ళ‌వారం మూల న‌క్ష‌త్రం కావ‌డంతో బాస‌ర‌లోని జ్ఞాన స‌ర‌స్వ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు ఉద‌యం 3 గంట‌ల నుంచే భ‌క్తులు పోటెత్తారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి సుమారుగా 2 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని స‌మాచారం. దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రుల ఉత్స‌వాల‌లో భాగంగా అమ్మ‌వారు కాత్యాయ‌ని అలంకారంలో ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.  

మూల న‌క్ష‌త్రం కావ‌డంతో భ‌క్తులు పెద్ద ఎత్తున అమ్మ‌వారి చెంత‌కు వ‌చ్చి ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. చిన్న‌పిల్ల‌ల‌కు ఈరోజు అక్ష‌రాభ్యాసం చేయిస్తే స‌రస్వ‌తీ ఆశీస్సుల‌తో అక్ష‌ర‌జ్ఞానం లభిస్తుంద‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ఉద‌యం నుంచే ప్రత్యేకంగా పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వం త‌రుపున మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌భుత్వం త‌రుపున ఉత్స‌వాల సంద‌ర్భంగా మూల‌న‌క్ష‌త్రం రోజు ఆన‌వాయితీగా ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించిన‌ట్టు వెల్ల‌డించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: