ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల్లో వైసీపీపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోమువీర్రాజు మ‌రొక‌సారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. నియోజ‌క‌వ‌ర్గంలో స్థానికంగా బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీ నాయ‌కులు త‌ప్పుడు కేసులు పెట్ట‌డంతో  పోలీసులు బెదిరిస్తుర‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌క్ష‌ణ‌మే ఎస్సై స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వ‌ర‌కు బ‌దిలీ చేయాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు.

 ఇంత‌కు ముందే పోలీసులు, అధికార పార్టీకి చెందిన నాయ‌కుల ఆగ‌డాల‌పై ఫిర్యాదు చేశాం అని గుర్తు చేశారు. ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా, నిష్ప‌క్ష‌పాతంగా, సజావుగా కొన‌సాగే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ఎన్నిక‌లు స‌జావుగా కొన‌సాగాలంటే కేంద్ర‌బ‌లగాల‌ను పంపాల‌న్నారు. అర్హులైన ఓట‌ర్ల‌నే ఏజెంట్లుగా నియ‌మించేలా చూడాల‌ని.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ కు మ‌రో ఫిర్యాదు చేశారు. పోరుమామిళ్ల‌, బీ కోడూరు మండ‌లాల‌లో ఆశావ‌ర్క‌ర్ల‌కు స్మార్ట్ ఫోన్లు, వాచ్‌ల‌ను వైద్య సిబ్బంది పంపిణీ చేసింద‌ని, ఎన్నిక‌ల కోడ్ ఉన్న‌ప్పుడు ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డం మూలంగా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే ఉంటుంద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వివ‌రించారు. అదేవిధంగా వైసీపీ నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: