అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్ప‌టికే ఈ సినిమాను  2022 జనవరి 7న థియేటర్లలో విడుదల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించ‌న‌ది చిత్ర‌బృందం.  ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధానపాత్ర‌దారులుగా న‌టిస్తున్నారు. డీవీవీ దాన‌య్య‌, ‘ఆర్ఆర్ఆర్’ను రూ.450 కోట్లకు పైగానే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడల‌తో పాటు ఇంగ్లీష్ మ‌రియు దాదాపు 10 భాషల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా  విడుదల కానున్న‌ది.  ఇటీవ‌ల‌ సెకండ్ సింగిల్ ప్రోమోను ఆర్ఆర్ఆర్ నుంచి విడుదల చేశారు. తాజాగా నాటు నాటు అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల అయింది. ఈ పాట‌లో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఊర‌మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు.

“నాటు నాటు” అంటూ సాగిన చంద్ర‌బోస్ రాసిన ఈపాటను రాహుల్ సిప్లిగంజ్‌, కాల‌భైర‌వ‌లు పాడారు. ఈపాట మాస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించే విధంగా ఉంది.  సాంగ్ ఊర నాటు అనే విషయం స్పష్టమవుతోంది. తాజాగా విడుద‌లైన ఈ సాంగ్  మాములుగా లేదు.  ప్ర‌మోష‌న్ల కోసం భారీ ప్లాన్లు వేస్తున్నాడు రాజ‌మౌళి. ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్‌కు ఈ సాంగ్ ఫుల్ మీల్స్‌గా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. రాజ‌మౌళి ఏ సినిమా తీసినా అభిమానుల‌ను ఆక‌ర్షించ‌డం, ఆక‌ట్టుకోవ‌డంలో దిట్ట అనే చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ అయిన  పీవీఆర్ తో చేతులు కలిపారు. ఇక నుంచి ఈ సినిమా విడుదలయ్యేంత‌ వరకు పీవీఆర్ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రమోషన్లు జరుగుతుంటాయి

మరింత సమాచారం తెలుసుకోండి: