తెలుగు అకాడమీ నిధులు గోల్‌మాల్ కేసులో ఓ కీలక మలుపు చోటు చేసుకున్న‌ది. ఇప్పటి వరకు ఈ కేసును సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేప‌ట్ట‌డం.. ఇకపై కేసు విచారణ బాధ్య‌త‌లు అన్నీ ఏసీబీ చేతికి అప్పగించారు.  ఇప్ప‌టికే నిందితులు క్రిమినల్ చర్యలతో పాటు.. అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడ్డారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ సీపీ యాక్ట్‌ కింద ఏసీబీ విచారణ చేప‌ట్ట‌నున్న‌ది.

 తెలుగు అకాడ‌మీ నిధుల గోల్‌మాల్‌ కేసులో నిందితులు దాదాపు 64.5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేసిన‌ట్టు అధికారులు ఇప్ప‌టికే దృవీక‌రించారు. ఈ కేసుకు సంబంధించి వెంకటసాయి కుమార్ తో సహా 18 మంది నిందితులను ఇప్ప‌టికే పోలీసులు అరెస్ట్ చేసారు. కేసులో తెలుగు అకాడమీ ఏవో రమేష్‌తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర  కూడ ఉన్న‌ది. ప్రభుత్వ బ్యాంకు అధికారుల పాత్రపై  ఏసీబీ విచారణ చేప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే మూడు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన‌ వివరాలు ఏసీబీకి సీసీఎస్ అధికారులు అంద‌జేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: