ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మ శ్రీ‌ చంబోలు  సీతారామ శాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి  క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేసారు.ఎటువంటి సంగీత ప్రియులతోనైనా పెనవేసుకు పోయే అద్భుత సాహిత్యాన్ని అందించిన సిరివెన్నెల, పండిత పామరుల మనసులను గెలిచారని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

అలుపెరుగ‌ని క‌లం ఇక లేదంటే.. తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని పేర్కొన్నారు. సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకుని సీతారామ‌శాస్త్రి సాహిత్య ప్ర‌స్థానం, సామాజిక, సాంప్ర‌దాయ అంశాల‌ను స్ప‌శిస్తూ మూడున్న‌ర ద‌శాబ్దాల పాటు కొన‌సాగింద‌ని గుర్తు చేసారు కేసీఆర్‌. సిరివెన్నెల మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న చిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానుల‌కు తీర‌ని లోటు అని పేర్కొన్నారు సీఎం. వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. ఆయ‌న ప్ర‌తి పాట‌లో కుటుంబాన్ని, రాజ‌కీయ నేప‌థ్యంలో ఏ పాట రాసినా అద్భుతంగా రాసేవార‌ని గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: