త‌మిళ‌నాడు రాష్ట్రంలోని నీల‌గిరి కొండ‌ల‌లో ఐఏఎఫ్ చాప‌ర్ కూలిన ఘ‌ట‌న‌లో మొత్తం 13 మంది మ‌ర‌ణించారు.  సీడీఎస్ బిపిన్ రావత్, ఆయ‌న భార్య మ‌ధులిక రావత్ అంత్యక్రియలు శుక్ర‌వారం  ఢిల్లీ కంటోన్మెంట్‌లో సైనిక లాంఛనాలతో జ‌రుగ‌నున్నాయి. 13 మంది పార్థివ దేహాల‌ను ప్ర‌స్తుతం వెల్లింగ్ట‌న్ నుంచి కోయంబ‌త్తూరు తీసుకెళ్లి.. అక్క‌డి నుంచి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నారు. బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌కు పలువురు ప్రముఖులు శ్ర‌ద్ధాంజ‌లి ఘటించనున్నారు.  

అయితే ఇవాళ త‌మిళ‌నాడు నుంచి ఢిల్లీకి త‌ర‌లించ‌నున్నారు. మ‌రొవైపు బిపిన్ ప్ర‌యాణించిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై ఇవాళ ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ కంటోన్మెంట్‌కు తీసుకొచ్చిన త‌రువాత‌.. ఫోటో క్రాల్ ప్ర‌కార‌మే బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తో పాటు మిగ‌తా 11 మంది అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాట్ల‌ను సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే  రేపు కామరాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్‌లోని ఆర్మీ క్రిమియేషన్ గ్రౌండ్ వ‌ర‌కు అంతిమ యాత్ర జరగనున్న‌ది. బిపిన్ రావత్ దంప‌తుల దహన సంస్కారాలు సైనిక మర్యాదలతో రేపు జరగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: