కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి,  భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీధరన్ సోమవారం కడప కేంద్ర కారాగానికి వచ్చారు. ఆయనేమీ నేరాలు చేసి జైలుకు రాలేదండోయ్. మరెందుకు వచ్చారు ? కేంద్ర మంత్రి హోదాలో జైలును తనిఖీ చేయడానికి వచ్చారా ? కాదు. మరెందుకు వచ్చారు.  అదే సస్పెన్స్.


ఢిల్లీ నుంచి విమానంలో కడప విమానాశ్రయం వద్ద కేంద్ర మంత్రి మురళీ ధరన్ విచ్చేశారు. ఆయన బిజేపి శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. ఇటీవల  కడప జిల్లాలో జరిగిన శాసన సభ ఉప ఎన్నికల్లో. పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించుకున్న బిజేపి ఆదే ఉత్సాహంతో కేంద్ర మంత్రికి స్వాగతం పలికాయి. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  కేంద్ర మంత్రి మురళీ ధరన్ ను దుశ్శాలవాతో సత్కరించి ఆహ్వానం పలికారు.

కడప విమానాశ్రయం వద్దే కేంద్ర మంత్రికి  ఎపి బిజెపి ఛీఫ్ సోమువీర్రాజు  కర్నూలు జిల్లా ఆత్మ కూరు సంఘటన లు అక్కడి  బిజెపి నేతల పై ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని  ప్రభుత్వం పెట్టిన కేసుల వ్యవహారం పై ఆయనకు వివరించారు. అక్కడి నుంచి నేతలు నేరుగా కడప సెంట్రల్ జైలు కు చేరుకున్నారు. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న. బిజెపి జిల్లా అథ్యక్షుడు బుడ్డా శ్రీ కాంత్ రెడ్డిని కేంద్ర మంత్రి మురళీధర్ పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: