ముఖ్యమంత్రి జగన్‌ ఇవాళ తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. తాడేపల్లిలోని ప్యాలస్‌ నుంచి సీఎం జగన్ ఈ ఉదయం 10.50 గం.కు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ శ్రీవకుళమాత ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పేరూరు నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాళహస్తి మండలం ఇనగళూరు వెళ్లనున్నారు. అక్కడ అపాచి సంస్థకు సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు.


ఇనగళూరు నుంచి హెలికాప్టర్‌లో రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లనున్న సీఎం జగన్.. రేణిగుంట నుంచి రోడ్డుమార్గాన వికృతమాలకు వెళ్తారు. అక్కడ టీసీఎల్, సన్నీ ఒపో ఆప్టిక్, ఫాక్స్ లింక్స్ కంపెనీల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కంపెనీల ప్రారంభోత్సవం, యూనిట్ల భూమి పూజలో సీఎం జగన్ పాల్గొంటారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొననున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం రేణిగుంట నుంచి గన్నవరం బయలుదేరతారు. సీఎం జగన్ ఒకే రోజు రెండు, మూడు కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: