త్రివిధ దళాల్లో నియామకాల కోసం మోడీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్  పథకానికి మంచి స్పందన వస్తోందని సైన్యం చెబుతోంది. వాయుసేనలో నియామకాల కోసం..... ఈనెల 24న రిజిస్ట్రేషన్  ప్రక్రియ ప్రారంభమైంి. ఆరు రోజుల వ్యవధిలోనే 2 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5న ముగుస్తుంది.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆర్మీ అధికారులు సూచించారు.


గత రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు చేపట్టలేదు. అందువల్ల ఈ ఏడాది గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచామని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. అందువల్లే దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నట్లు ‌అంచనా వేస్తున్నారు. అగ్నిపథ్  పథకం కింద నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక.. వారిలో 25 శాతం మంది అగ్నివీరులను రెగ్యులర్  సర్వీసుల్లోకి తీసుకుంటారు. సైన్యంలో చేరాలనుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: