సెప్టెంబర్ 17.. ఇవాళ ప్రధాని మోడీ పుట్టిన రోజు.. ఇది ఏటా జరిగేదే అయినా.. ఈ పుట్టిన రోజు ప్రధానికి చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎందుకంటే.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఇవాళ దేశ వ్యాప్తంగా రికార్డుస్థాయిలో రక్త దానాలు జరిగాయి. ఇవాళ ఒక్క రోజే ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా 87 వేల మందికి రక్త దానం చేశారు.


ఇలా ఒకే రోజు ఒక కారణంతో రక్త దానం చేయడం ప్రపంచ రికార్డుగా చెబుతున్నారు. ఈ రక్త దానం గురించి కేంద్రమంత్రి మాండవీయ ఓ ప్రకటన చేశారు. ఇంత పెద్దఎత్తున రక్తదానం చేయడం ప్రపంచ రికార్డుగా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. రక్తదాన్‌ అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా స్వచ్ఛందంగా రక్త దానం నిర్వహించినట్టు ఆయన తెలిపారు. బీజేపీ దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు ఉన్న పార్టీ.. ఆ పార్టీ నేతగా మోడీ జన్మదినం రోజు మరువలేని కానుకే ఇచ్చారని చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: