దేవుడికి భక్తులకు అనుసంధానంగా ఉండే అర్చకులు తమ గోడు వినాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్చకుల సమస్యలపై చర్చించేందుకు అర్చక ప్రతినిధులతో ఏర్పాటు చేసే వివిధ కమిటీలలో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అర్చక ఐక్య వేదిక ప్రతినిధులు ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను కలిశారు. తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ధార్మిక పరిషత్తు ఏర్పాటు, అర్చక సంక్షేమ నిధి ట్రస్టు బోర్డు నియామకం, అర్చక సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు అర్చక ప్రతినిధులు, అధికారులతో గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటుకు గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్‌ అర్చక ఐక్య వేదిక ప్రతినిధులు మంత్రిని  కోరారు. సెక్షన్‌ 43 రిజిష్టర్లలో వంశపారంపర్య అర్చకుల పేర్ల నమోదుకు స్థానం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ అర్చక ఐక్య వేదిక ప్రతినిధులు  విజ్ఞప్తి చేశారు. అర్చక ప్రతినిధుల వినతులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యనారాయణ హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: