కేవలం సబ్జెక్ట్ మాత్రమే బోధించకుండా..విద్యార్థులకు అవసరమైన విజ్ఞానాన్ని అందించేందుకు విద్యాసంస్థలు కృషిచేయాలి. వర్సిటీలో చదువు ముగిసిన తర్వాత బయటకు వెళ్లిన తర్వాత విద్యార్థులకు అవసరమైన సాంకేతిక అంశాలు, వ్యక్తిత్వ వికాసం, భావవ్యక్తీకరణ తదితర అంశాలను జోడించి సిలబస్ లో మార్పులు చేయాలి. సాంకేతిక విజ్ఞానంతో పాటు, గ్రూఫ్ లీడర్ గా వాళ్లు తమ లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. 72 -90 గ్రాడ్యుయేట్లు తాము ఉద్యోగం చేయడానికి కావాల్సిన పరిజ్ఞానం లేవు. దానికి ప్రధాన కారణం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్ మెంట్ స్కిల్స్ తో పాటు, జీవితం పై సంపూర్ణ అవగాహన లేకపోవడమే.


ప్రొఫెసనల్ ఎథిక్స్, మానవవిలువలపైనా దృష్టిసారించాలి.  కొత్తగా బీబీఏ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలి. ఫోటో గ్రఫీ వంటి కోర్సులకు డిమాండ్ భారీగా ఉంది. అందుకే అటువంటి కోర్సులను ఏడాది, రెండేళ్లు ఉండే విధంగా అందుబాటులోకి తీసుకురావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: