విశాఖలోని ఆర్కే బీచ్ లో ఈ సాయంత్రం నౌకా దళ విన్యాసాలు జరగబోతున్నాయి. భారత నౌకా దళ పాటవాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించే  కార్యాచరణ ప్రదర్శన జరగనుంది. వీటిని అందర్నీ వీక్షించాల్సిందిగా తూర్పు నౌకా దళం కోరింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్  ఎస్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఒక అద్భుతమైన సాయంత్రంతో మిమ్మల్ని థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉందని.. ప్రజలకు ఆహ్వానం పలికిన నేవీ.. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆర్కే బీచ్ లో గగనతలలో భారత నౌకాసేన వాయు విభాగం విన్యాసాలు ప్రదర్శించనుంది.

సముద్రపు నీటిపై యుద్ధ నౌకల నుంచి విన్యాసాలు ఉంటాయి. యుద్ధ సమయంలో మెరైన్ కమాండోలు, నౌకాదళ సిబ్బంది ప్రదర్శించే పోరాట పటిమ ను ప్రత్యక్షంగా  చూసే అవకాశం లభిస్తుంది. ఈ నెల నాలుగున జరగాల్సిన విన్యాసాలు తుఫాను కారణంగా వాయిదా పడగా ఇవాళ జరుగుతున్నాయి. ఆదివారం కూడా కావడంతో భారీగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఆర్కే బీచ్ కి వెళ్లే అన్ని మార్గాలలో ను ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: