టీడీపీతో పొత్తు పెట్టుకుని పావలా శాతం సీట్లు తెచ్చుకోలేని పవర్‌ లెస్ స్టార్ పవన్ కల్యాణ్ అంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను చూశాక.. అసలు, పవన్‌కళ్యాణ్‌ ఎందుకు పార్టీ పెట్టాడో కూడా అర్ధం కావట్లేదని మంత్రి రోజా అన్నారు. జనసేన నాయకత్వానికి, కార్యకర్తలకూ ఏమీ అర్ధం కాని పరిస్థితిలో వారంతా అయోమయంలో ఉన్నారన్న మంత్రి రోజా.. ఈ మాత్రం దానికే పవర్‌ షేరింగ్‌.. సీట్‌ షేరింగ్‌.. ఓట్‌ షేరింగ్‌ అని పవన్ కల్యాణ్ ప్రగల్భాలు పలికాడని ఎద్దేవా చేశారు.


తీరా పావలాశాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్‌ స్టార్‌ అంటున్న మంత్రి రోజా.. వీటన్నింటినీ చూసి.. పవన్‌ కళ్యాణ్‌ను పవర్‌ స్టార్‌ కాదు.. పవర్‌ లెస్ స్టార్‌ అని ప్రజలు అంటున్నారని అన్నారు. 2019లో ఓ సభలో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ.. తన పార్టీని తెలుగుదేశం ఎలా చూస్తుందో చెప్పుకొచ్చాడని గుర్తు చేసిన మంత్రి రోజా.. మరి ఈరోజు కేవలం 24 సీట్లకు కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపుకుంటూ ఎందుకు వెళ్లినట్టు అని పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: