పరీక్షలు పారదర్శకంగా,  నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌లో మెరుగుదల, NTA నిర్మాణం,  పనితీరుపై సిఫార్సుల కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. 2 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏడుగురితో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం.. చైర్మన్ గా ఇస్రో మాజీ చైర్మన్
డా. కె. రాధాకృష్ణన్ ను నియమించింది.

ఇక ఈ కమిటీ సభ్యులుగా.. ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విసి ప్రొఫెసర్ బి జె రావు, IIT మద్రాస్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రామమూర్తి , కర్మయోగి భారత్ సహా వ్యవస్థాపకులు పంకజ్ బన్సల్, IIT ఢిల్లీ  స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కమిటీ సభ్య కార్యదర్శి గా  విద్యా మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి  గోవింద్ జైస్వాల్ వ్యవహారిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: