పహల్గాంలో జరిగిన దాడికి బదులుగా భారత్, పాకిస్తాన్ పై దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ నిర్వహించనున్నారు. డిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి. వీలైనంత త్వరగా భట్టి విక్రమార్కని హైదరాబాద్ కి రావాలని సూచించినట్లు తెలుస్తోంది. నేడు ఉదయం 11 గంటలకు మీటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనున్న ఈ సమీక్షకి ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరుకనున్నారు.

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రాంతాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నీ విభాగాలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను పర్యవేక్షించనున్నారు.  


ఇక పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగిన విషయం తెలిసిందే. కాశ్మీర్ పీవోకే లో భారత సైన్యం దాడులు నిర్వహించింది.  పాకిస్థాన్ లోని భారత్ 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది. పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాలతో పాటు పలు చోట్లలో మెరుపు దాడులు చేసినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇటు భారత్, అటు పాకిస్తాన్ ఇరుదేశాల సైనికులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: