ఇండియా పాకిస్తాన్ మధ్య ఉధ్రిక్త‌ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ పాకిస్తాన్ మళ్లీ ఇండియా బార్డర్ లో కాల్పులకు తెగబడుతోంది. మ‌రోవైపు డ్రోన్ దాడులు కూడా చేస్తూ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో మళ్లీ కాల్పులు జరిగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత్ దాయాది దేశాన్ని హెచ్చరించింది. మరోవైపు రెండు దేశాల మధ్య రేపు శాంతి చర్చలు జరగనున్నాయి.

ఇలాంటి సమయంలో బలూచిస్తాను విడుదల చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా బలిచిస్తాన్ పేర్కొంది. జరగబోయే చర్చల నేపథ్యంలో భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే తాము అండగా ఉంటామని పశ్చిమం నుండి పాకిస్తాన్ పై అటాక్ చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే బలూచిస్తాన్ కూడా ప్రస్తుతం పాకిస్థాన్ లో ఒక భాగమే, కానీ ఒకప్పుడు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఉండేది. బలూచిస్తాన్ లో ఖ‌నిజనిక్షేపాలు అధికంగా ఉండడంతో పాకిస్తాన్ దానిని ఆక్రమించుకుంది. ప్రస్తుతం పాక్ ఆధీనంలోనే బలుచిస్తాన్ ఉండగా బిఎల్ఎ స్వతంత్రం కోసం కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తోంది.

ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాకిస్థాన్ సైన్యం అంతా భారత సరిహద్దుల్లో మోహరించింది. దీంతో ఆ దేశంలో ఆర్మీ లోటు ఏర్పడటంతో బలుచిస్తాన్ తమ ప్రాంతంలోని ఆర్మీ పై దాడులు చేసి బ‌లూచిస్తాన్ జెండాలను ఎగురవేసింది. బలుచిస్తాన్ లో ఓ ప్రాంతాన్ని కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇండియా పాక్ మధ్య యుద్ధం జరిగితే అదే అదునుగా భావించి పూర్తిగా పాన్ నుండి స్వ‌తంత్రం పొందాల‌ని బీఎల్ ఏ భావించింది. కానీ రేపు జ‌ర‌గ‌బోయే శాంతి చ‌ర్చ‌ల్లో భార‌త్ కండిష‌న్స్ కు పాక్ అంగీక‌రించ‌క‌పోతే యుద్దం త‌ప్ప‌దు. కాబ‌ట్టి ముందే త‌మ మ‌ద్ద‌తు భార‌త్ కు ప్ర‌క‌టించింది. ఒక‌వేళ యుద్దం జ‌రిగితే పాకిస్థాన్ కు బ‌లూచిస్తాన్, భార‌త్ క‌లిసి చుక్క‌లు చూపించే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: