పహల్గాంలో జరిగిన దాడికి భారత్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. మే 7వ తేదీన పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగింది. కాశ్మీర్ పీవోకేలో ఉగ్ర‌శిభిరాల‌పై భారత్ మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరును ప్రధాని నరేంద్ర మోదీ పెట్టిన సంగతి అందరికీ తెలుసు.

అయితే ఈ ఆపరేషన్ సింధూర్ లోగోను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మరి ఆ లోగో రూపుకల్పన వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ లోగోను లెఫ్ట్ నెంట్ కల్నల్ హర్ష గుప్తా మరియు హవల్దార్ సురీందర్ సింగ్ లు రూపొందించారు. ఈ లోగోను రూపొందించిన ఘనత వారిద్దరికీ దక్కుతుంది. అయితే ఈ లోగోని ఎంతో విన్నుతంగా రూపొందించారు.

అందులో ఆపరేషన్ సింధూర్ అనే పదాలను వైట్ అక్షరాలతో రాశారు. ఈ లోగో బ్యాక్ గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్ లో రూపొందించారు. ఆ బ్లాక్ కలర్ పాకిస్తాన్ కాశ్మీర్ లో చేసిన దాడులకు భర్తలను కోల్పోయిన మహిళలకు సంకేతంగా డిజైన్ చేశారు. అలాగే సింధూర్ పదంలోని ఒక O అక్షరం ఒక సింధూరం గిన్నెగా చిత్రీకరించబడింది. ఆ గిన్నెలోని ఎర్రటి పొడి చెల్లాచెదురుగా చిందించినట్లు కనిపించింది. హిందూ సాంప్రదాయాల ప్రకారం నుదుటిపై సింధూరం సౌభాగ్యానికి సంకేతం. పాక్ దాడుల కారణంగా ఎంతోమంది వారి భర్తలను కోల్పోయి సౌభాగ్యానికి దూరం అయ్యారని దాని అర్థం. అలాగే చెల్లాచెదురుగా చిందిన సింధూరం.. చనిపోయిన వారి రక్తానికి సంకేతం. కేవలం ఆపరేషన్ సింధూర్ లోగోలోనే మొత్తం మెసేజ్ ని రూపు కల్పన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: