క్రెడిట్ అనగా తెలుగులో అప్పు, అరువు, బాకీ, బదులు అని అర్థాలు వస్తాయి. క్రెడిట్ కార్డ్ అనగా అప్పు ఇచ్చే కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డిఎఫ్‌సి తదితర బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంటాయి. అయితే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క లిమిట్ ఇస్తుంటాయి. ఈ పరిమితిని బట్టి కార్డుదారులు షాపింగ్ మాల్స్ లో, రిటైల్ స్టోర్స్ లలో తమకు అవసరమైన వస్తువులను అప్పుగా పొందొచ్చు.

అయితే కార్డుదారులకు బదులుగా క్రెడిట్ కార్డు కంపెనీలు, షాపులకు డబ్బులు చెల్లిస్తాయి. నెల రోజుల తర్వాత క్రెడిట్ కార్డ్ ద్వారా ఎంత డబ్బు ఖర్చు చేశారో ఆ ఖర్చులకు సంబంధించిన డిటైల్డ్ బిల్లు మెయిల్ ద్వారా కార్డుదారులకు అందుతుంది. దాని ప్రకారం కార్డుదారులు తిరిగి క్రెడిట్ కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి మొత్తం బిల్లు చెల్లించలేకపోతే కొంత మొత్తం చెల్లించి మిగతాది వచ్చే నెలలో చెల్లించవచ్చు. అయితే ఈ ఆర్టికల్ లో స్టూడెంట్స్ తీసుకోవాల్సిన ఉత్తమ క్రెడిట్ కార్డ్స్ ఏంటో తెలుసుకుందాం.

1. డిస్కవర్ ఇట్® స్టూడెంట్ క్యాష్ బ్యాక్:

ఈ కార్డు ద్వారా స్టూడెంట్స్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. 3 నెలల వరకు అమెజాన్.కామ్, గ్రాసరీ స్టోర్, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు వంటి వివిధ ప్రదేశాలలో రోజువారీ కొనుగోళ్లకు 5% క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఫస్ట్ పేమెంట్ లేటుగా చేసినందుకుగాను ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించనక్కర్లేదు. వార్షిక పర్సంటేజ్ రేట్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల వరకు ఎటువంటి వడ్డీ కట్టకుండా ఈ క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత 12.99% - 21.99% వరకు వార్షిక వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.

2. డిస్కవర్ ఇట్® స్టూడెంట్ క్రోమ్:

ఈ కార్డు ద్వారా కూడా స్టూడెంట్స్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు ప్రదేశాలలో రోజువారీ కొనుగోళ్లకు 2% క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఫస్ట్ పేమెంట్ లేటుగా చేసినందుకుగాను ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించనక్కర్లేదు. వార్షిక వడ్డీ రేట్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మొదటి 6 నెలల వరకు ఎటువంటి వడ్డీ కట్టకుండా ఈ క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత 12.99% - 21.99% వరకు వార్షిక వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.

3. చేజ్ ఫ్రీడమ్ ® స్టూడెంట్ క్రెడిట్ కార్డ్:

అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి 3 నెలల్లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేస్తే.. $50 బోనస్ లభిస్తుంది. ప్రతి కొనుగోలు పై ఒక శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. క్రెడిట్ కార్డు ప్రమాణాలకు అనుగుణంగా అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 10 నెలల్లోపు 5 నెలవారీ చెల్లింపులు సరైన సమయానికి పూర్తి చేస్తే క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. క్యాష్ బ్యాక్ విత్ డ్రా చేసుకోవడానికి మినిమమ్ అమౌంట్ అంటూ ఏదీ ఉండదు. 14.99% - 29.99% వరకు వార్షిక వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: