ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తూ ఉన్నాయి. ఇక కొత్తగా అమల్లోకి వచ్చిన వడ్డీ రేట్లలో సాధారణ వినియోగదారుల కంటే సీనియర్‌ సిటిజన్స్‌కు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.ఇక బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల చేసే వారికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి బ్యాంకులు. ఉద్యోగ విరమణ తర్వాత అధిక రాబడి పొందాలనుకునేవారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అనేవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. ఇక ఐడీబీఐ బ్యాంకు ఇంకా డీబీఎస్‌ బ్యాంకు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచాయి.అలాగే IDBI బ్యాంకు రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. ఇంకా జూలై 14 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. BDS బ్యాంకు తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెంచడం జరిగింది.ఇక ఈ రేట్లు జూలై 15 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.ఇంకా అలాగే 6 నెలల 1 రోజు నుంచి 270 రోజులలో మెచ్యూర్‌ అయ్యే దేశీయ టర్మ్‌ డిపాజిట్లు ఇప్పుడు 4.50 శాతం వడ్డీ రేటు లభిచనుంది. 1 సంవత్సరం నుంచి 18 నెలల లోపు మెచ్యూర్‌ అయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఇప్పుడు 5.35 శాతం వడ్డీ రేటు ఇంకా 18 నెలల నుంచి 30 నెలలోపు కాలవ్యవధికి 5.40 శాతం వడ్డీ రేటు అలాగే 30 నెలల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 5.50 శాతం వడ్డీరేటును అందజేస్తున్నాయి.ఇక డీబీఎస్‌ బ్యాంకు ఇండియా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీర ఏట్లను 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్లని పెంచింది.


 అదనంగా సీనియర్‌ సిటిజన్లు వచ్చేసి ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం డిపాజిట్ల కోసం కొత్త రేట్ల కంటే 50 బేసిస్‌ పాయింట్లని అందుకుంటారు. ఇక ఈ బ్యాంకు 181 రోజుల నుంచి 269 రోజుల వరకు సాధారణ ప్రజలకు వర్తించే కాలవ్యవధికి మనుపటి 3.25 శాతం నుంచి 4.75 శాతానికి 150 బేసిస్‌ పాయింట్లు అనేవి పెంచబడ్డాయి. ఇంకా అలాగే 270 రోజుల నుంచి 1 సంవత్సరంలోపు 100 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4.75 శాతానికి అలాగే ఒక సంవత్సరం నుంచి 375 రోజుల మధ్య కాలానికి 5.65 శాతానికి పెంచబడటం జరిగింది. ఇందులో మొత్తం 35 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు కాల వ్యవధిలో ఎఫ్‌డీ రేటు 6 శాతం ఇంకా మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ, లేదా సమానంగా డీబీఎస్‌ బ్యాంకు ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మనుపటి 6 శాతం నుంచి 6.75 శాతానికి పెంచడం జరిగింది.ఇంకా అలాగే జూలై 16నుంచి యాక్సిస్‌ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన 6 నెలల నుంచి 7 నెలల కంటే తక్కువ కాల వ్యవధిలో అలాగే 8 నెలల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీల కోసం 9 నెలల లోపు వడ్డీ రేట్లు 4.40 శాతం నుంచి 4.65 శాతానికి పెంచడం జరిగింది.ఇతర ఎఫ్‌డీ వడ్డీ రేట్లు కూడా మారలేదు.ఇంకా ఒక సంవత్సరం 25 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ కాలానికి మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లపై 5.60 శాతం అలాగే 15 నెలల నుంచి రెండేళ్లలోపు మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లు 5.60 శాతం కొనసాగుతుంది.ఇంకా 11 రోజుల నుంచి ఒక సంవత్సరం 25 రోజులలో మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటును కూడా అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: