అంబానీ ఏం చేసినా ట్రెండ్ సెట్ చేసేలా ఉంటుంది. ఈ మధ్యనే తమ కుటుంబంలో పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రిలయన్స్ జియో రీచార్జ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంచేశారు. దీంతో జియోపై అందరూ కోపంతో ఉన్నారు. ధరలు పెంచడం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ బిజినెస్‌పై బాగానే ప్రభావం చూపింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వల్ల వారి వ్యాపారాలు పాజిటివ్‌గానే ముందుకు సాగాయి. అయితే జియో ప్లాన్స్ ధరలు పెంచడంతో కాస్త నెగెటివ్ టాక్ పెరిగిందని చెప్పాలి. దీనిపై వినియోగదారులు జియోపై విరుచుకుపడ్డారు.

కొడుకు పెళ్లి చేయడం కోసం తమ వద్ద ఖర్చులు వసూలు చేస్తున్నారని జియో యూజర్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో దీనిపై అనేక మీమ్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జియో యూజర్లను కూల్ చేసేందుకు రిలయన్స్ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే జియో రూ.175ల రీచార్జ్ ప్లాన్. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వినోదాన్ని పొందొచ్చు. ఆ రీచార్జ్‌తో హైస్పీడ్ డేటాతో పాటు ఏకంగా 12 ఓటీటీ యాప్స్ వినియోగించుకోవచ్చు.

కేవలం వినోదం మాత్రమే కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ భలే వర్కౌట్ అవుతుంది. ఈ ప్లాన్ ద్వారా 10జీబీ హైస్పీడ్ డేటాతో పాటుగా 12 ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ను ఉచితంగా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో ఇది లభిస్తుంది. డేటా వాడేందుకు రోజువారి పరిమితి కూడా లేదు. సోనీ లివ్, జీ5, డిస్కవరీ ప్లస్, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీ సేవలన్ని ఫ్రీగా పొందొచ్చు. అయితే ఇది కేవలం డేటాకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ వల్ల వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు లభించవు. ఈ ప్లాన్ పొందేందుకు ఇతర యాక్టీవ్ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవాలి. కేవలం వినోదం కోసం మాత్రమే అయితే రూ.175ల రీచార్జ్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: