ప్రతిరోజు ఉదయం పూట అట్టు, ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందా. అయితే ఈసారి కాస్త వెరైటీ గా బొంబాయి రవ్వతో టమాటో బాత్ చేసి చూడండి. బొంబాయి రవ్వ ఉప్మా కన్నా ఈ టమాటో బాత్ ఉప్మా చాలా రుచికరంగా ఉంటుంది.ఇండియా హెరాల్డ్ వారు మీకోసం ఈరోజు టమోటో బాత్ ఎలా చేయాలో మీకు వివరించబోతున్నారు. దీనికి కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా. !

కావాల్సిన పదార్ధాలు:

1 cup బొంబాయి రవ్వ

2 టమాటాలు

1/4 cup కేరట్ తరుగు

1/2 cup ఉల్లిపాయ తరుగు

1 పచ్చిమిర్చి

1 tbsp అల్లం తరుగు

1 రెబ్బ కరివేపాకు

 కొత్తిమీర కొద్దిగా

జీడి పప్పు - కొద్దిగా

1 tsp ఆవాలు

1 tsp సెనగపప్పు

1 tsp మినపప్పు

1 tsp జీలకర్ర

1/2 tsp పసుపు

ఉప్పు

2 tbsps నూనె

1/4 cup నెయ్యి

సరిపడా నీళ్ళు

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి తక్కవ మంట పెట్టి మంచి సువాసన వచ్చే దాక వేపుకోవాలి.రవ్వ వేగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నెయ్యి,కొద్దిగా నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసి పక్కనపెట్టుకోండి. మళ్ళీ అదే నూనె లో తాలింపు కోసం ఉంచిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు,కరివేపాకు వేసి తాలింపు పెట్టండి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేపుకోండి.ఆ తరువాత అల్లం తరుగు, ఉల్లిపాయలు వేసి వేపాలి.ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత అందులో టమాటో ముక్కలు వేసి 2 వేపాలి. అవి కూడా వేగిన తరువాత అందులో కేరట్ తరుగు,పుసుపు,ఉప్పు వేసి అన్నీ మెత్తగా మగ్గేవరకు వేపాలి.ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసి ఎసరుని బాగా మరగనివ్వండి.ఆ తరువాత రవ్వ వేసి బాగా కలపాలి. లేదంటే ఉండలు ఉండలు కడతాయి. తరువాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో కొత్తిమీర, జీడిపప్పు, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో ఘుమ ఘుమ లాడే టమాటో బాత్ రెడీ అయినట్లే.







మరింత సమాచారం తెలుసుకోండి: