వేడి వేడి అన్నంలో పచ్చడి వేసి పైనుంచి  కొంచెం నెయ్యి లేదా పోపుపెట్టిన నూనె వేసి మొదటి ముద్ద తింటే,ఆహా! ఆ తృప్తే వేరు. వేసవి కాలం అనగానే అందరికి గుర్తొచ్చేది మామిడిపళ్ళు,  పుచ్చకాయలు, ఐస్ క్రీములు, స్మూతీలు, మామికాయలు, పచ్చడ్లు. పచ్చడ్లు  అంటేనే ఎండాకాలం. మరి వేసవి కాలం అయిపోయాక సంవత్సరం మధ్యలో ఏదైనా పచ్చడి పెట్టాలి అనుకుంటున్నారా? ఐతే ఇంకేంటి టమాటో నిలువ పచ్చడిని ట్రై చేయాల్సిందే.

కావాల్సిన పదార్థాలు:
టమాటాలు - 1/4 కే.జి.
కారం - 2 1/2  టేబుల్ స్పూన్స్
పసుపు-1  టీ స్పూన్
ఆవాలపొడి - 1 టీ స్పూన్
ఇంగువ - 1 టీ స్పూన్
ఆవాలు - 1 టీ స్పూన్
మెంతిపిండి-1/2 స్పూన్
వెల్లులిపాయి రెమ్మలు-4
చింతపండు రెమ్మలు - 4  లేదా 5
నూనె - తగినంత
ఉప్పు- తగినంత

తయారు చేసే విధానం:
ముందుగా టమాటాలను  శుభ్రముగా కడుగుకొని, తడి లేకుండా తుడుచుకోవాలి. టమాటాలను  మీడియం సైజు ముక్కలుగా తరుగుకోవాలి. ఒక బాణలి పెట్టి దానిలో సరిపడ నునే పోసి  అది వేడి అయ్యాక  1 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట లాడగానే  వేడిగ కాగుతున్న నూనెలో, ముక్కలుగా కోసుకున్న టొమాటాలని అందులో వేసి మగ్గనివాలి.మగ్గుతునప్పుడు 4 లేదా 5  చింతపండు రెమ్మలు వేసుకోవాలి. ఒక ఐదు నిమిషములు మగ్గిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయొచ్చు.ఇది చల్లారిన తర్వాత దానిలో 21/2  టేబుల్ స్పూన్స్ కారం పొడి,1టీ స్పూన్ పసుపు,1 టీ స్పూన్ ఆవాలపొడి,1 టీ స్పూన్ ఇంగువ,1/2 స్పూన్ మెంతిపిండి వేసి కలపాలి.4వెల్లులిపాయి రెమ్మలును కచ్చా-పక్కగా దంచుకోవాలి. ఆ  దంచిన వెల్లిరేమల్ని  పచ్చడిలో వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చడికి సరిపడ ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి.(ఉప్పు, కారాలు ఎక్కువ లేదా తక్కువ తినే వారు ఉంటె వారివారి రుచికితగట్లు మార్పులు చేసుకోవచ్చు) ఒక గిన్నెలో దీన్ని తీసిపెట్టుకోవాలి. తడి పడకుండ జాగ్రత పడాలి.
ఈ పచ్చడి మనకి వారం రోజులకి పైగా నిలువ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: