ప్రపంచంలో ఎక్కడైనా మనం ఒక రుచికరమైన వంటకం పేరు అంటే , చాలా మంది వెంటనే చెప్పేది బిర్యానీ! అది కేవలం భోజనం కాదు, మనందరి ఇష్టమైన ఫీల్‌గుడ్ ఫుడ్! అందుకే , ప్రతి సంవత్సరం జూలై నెలలో తొలి ఆదివారం, ప్రపంచ బిర్యానీ దినోత్సవం గా జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకంగా ఎందుకు ? ఎందుకంటే బిర్యానీకి ఉన్న క్రేజ్‌కు ఇది సరైన గౌరవం ! హోటళ్లూ, ఫుడ్ డెలివరీ యాప్‌లూ స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఈ రోజును సెలబ్రేట్ చేస్తాయి. నిజంగా ఇది బిర్యానీ ప్రేమికులకో పండగే ! బిర్యానీకి ఎక్కడినుంచి ఆరంభమయ్యిందో తెలుసా? బిర్యానీ అనే పదం పర్షియన్ భాష (ఇప్పటి ఇరాన్) నుంచి వచ్చినది. అప్పుడు మొగల్ రాజులు ఇండియాకు వచ్చినప్పుడు వారు తమతో పాటు బిర్యానీ వంటకాన్నీ తీసుకొచ్చారు .

ఇక అప్పటినుంచి ఇది మన దేశంలో ఒక్కొక్క చోట ఒక్కో స్టైల్లో రూపం మార్చుకుంటూ వచ్చింది. ప్రతి ప్రదేశానికీ త‌న‌దైన బిర్యానీ! భారతదేశంలో ఇప్పుడే ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నాయి: హైదరాబాద్ దమ్ బిర్యానీ – మసాలాలతో మైండ్ బ్లోయింగ్ టేస్ట్! లక్నో బిర్యానీ – తేలికగా, సుగంధ ద్రవ్యాలతో. కోల్కతా బిర్యానీ – ఇందులో బంగాళాదుంప కూడా ఉంటుంది!మన దగ్గరే – ఉలవచారు బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ 65 బిర్యానీ వంటి ఎన్నో వెరైటీలు. బిర్యానీ అంటే కేవలం ఫుడ్ కాదు – కలసికొట్టే సంస్కృతి! ఇప్పుడు బిర్యానీ అనేది కేవలం వంటకం మాత్రమే కాదు. ఇది ఒక ఆహార సంస్కృతి, మిత్రులతో పంచుకునే సంతోషకరమైన అనుభూతి .   అందుకే బిర్యానీ డేను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటూ .. ఈ రుచికర వంటకానికి ఇంత గొప్ప గౌరవం ఇవ్వటం ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: