కొద్దిరోజుల క్రితం ఇదే జిల్లాకు చెందిన ఓ యువతిని దారుణంగా అత్యాచారం చేశారు కొంతమంది యువకులు. రాత్రివేళ రోడ్డుపై తండ్రి కోసం ఎదురుచూస్తున్న బాలికను అగంతకుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత నూజివీడు ట్రిపుల్ ఐటీ వెనక ఆమెను వదిలివెళ్లారు. అపస్మారక స్థితిలో పడి బాలికను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనలు కృష్ణా జిల్లాలో గడిచిన కొద్ది సంవత్సరాలుగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారతావనిలో మహిళలపై అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన ఈ గణాంకాలు అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
2018తో పోలిస్తే, 2019లో దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగాయలని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2019లో దేశంలో 87 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయనీ..2020లో మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 4.05 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. గతం కంటే అత్యాచారాలు 7.3శాతం పెరిగాయని తెలిపింది. అంటే ఏడాది ఏడాదికి అత్యాచారాలు పెరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది. ‘క్రైమ్స్ ఇన్ ఇండియా – 2019’ పేరిట ఈ నివేదిక విడుదల కాగా, మహిళలపై నేరాలు 7.3 శాతం పెరిగాయని, ప్రతి లక్ష మంది మహిళల్లో 62.4 మంది అత్యాచారాలు, వేధింపులను ఎదుర్కొన్న వారేనని తెలిపింది. 2018లో మహిళలపై వివిధ రకాల నేరాలకు పాల్పడిన కేసులు 3,78,236గా ఉండగా, 2019లో వాటి సంఖ్య 4,05,861కి పెరిగాయని పేర్కొంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి