
ప్రేమించుకోవడం కొన్ని రోజుల తరువాత చిన్న చిన్న కారణాల వలన విడిపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. చిన్న చిన్న మనస్పర్థలు, ఒకరిపట్ల ఒకరికి నమ్మకం లేక ప్రేమించిన వ్యక్తిని మరిచిపోయి చాలా సులువుగా బ్రేకప్ చెప్పుకునేవారు ఈ కాలంలో ఎక్కువ అయిపోయారు.అయితే ఈ క్రమంలోనే తాము ప్రేమించిన ప్రియుడు లేదా ప్రియురాలిపై కోపం పెంచుకుని వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక యువతి తన ప్రియుడి మీద కోపంతో రూ.23లక్షల విలువైన బైక్ ని తగలపెట్టింది. ఈ సంఘటన థాయ్ లాండ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట కొంతకాలం ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న సమయంలో కనాక్ వావన్ అనే యువతి తన లవర్‌కు లక్షల విలువైన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందట. తరువాత వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ప్రియుడితో బ్రేక్ అప్ అయిన తర్వాత తను ఇచ్చిన బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి అతన్ని కోరగా ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ యువతి ఓ ప్లాన్ వేసింది.
ప్లాన్ ప్రకారం బ్యాంకాక్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో ప్రియుడి బైక్ పార్క్ చేసి ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆమె ఇచ్చిన బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టింది.కానీ ఆ బైక్ ఒక్కటే తగలబడలేదు మంటలు ఎక్కువ అవ్వడం వలన పక్కనే ఉన్న మరో ఆరు బైక్‌లకు కూడా మంటల్లో చిక్కుకున్నాయి.అది గమనించిన సిబ్బంది వెంటనే తెరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందని పోలీసలు సీసీ టీవీఫుటేజీని పరిశీలించగా ఓ మహిళ వచ్చి ఓ బైక్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం పోలీసులు గమనించారు. ప్రమాదానికి కనాక్ వావన్ కారణమని తెలుసుకొని ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.