నేటి సమాజంలో బ్రతుకుతున్నది మనుషులా లేక మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలా అంటే.. మానవత్వం ఉన్న మనిషి సభ్యసమాజంలో బ్రతుకుతున్నారు అని మాత్రం ఎవరూ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నేటి రోజుల్లో మనుషులు ప్రవర్తిస్తున్న తీరు అంత దారుణంగా ఉంది అనే చెప్పాలి. రోజురోజుకీ మనిషి మానవ విలువలను మరిచిపోయి బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వడం లేదు. ముఖ్యంగా క్షణకాల సుఖం కోసం మనిషి చేస్తున్న దారుణాలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇలా ఇలా మగాడు మ్రుగాడిగా మారిపోతూ ఉన్న నేపథ్యంలో ఆడపిల్ల జీవితం రోజురోజుకీ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది.


 మనిషి నాగరికత సమాజంలోకి అడుగుపెడుతున్నాడు అని అందరూ అంటున్నారు. కానీ మనిషి ఆలోచన మాత్రం ఇంకా అడవి మనిషి లాగా మారిపోతుంది.. ఏకంగా సొంత వారి విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక కన్నతండ్రి కామానికి అభం  శుభం తెలియని కూతురు  బలి అయ్యింది . కంటికి రెప్పలా కూతురిని కాపాడుకోవాల్సిన తండ్రి కాల నాగుల మారి  కన్నకూతురిపైనే కామవాంఛలు తీర్చుకున్నాడు. ఎక్కడ ఎవరికి తెలియకుండా కుమార్తె పై కొన్ని నెలల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.


 గుంతకల్లులో భాగ్య నగర్ కు చెందిన పెయింటర్ భార్య ఇద్దరు ఇద్దరు కుమార్తెలు లో ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన వ్యక్తి  తన పెద్ద కుమార్తె పై అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీంతో ఇటీవలే బాలిక గర్భం దాల్చింది. అయితే విషయం ఎవరికైనా చెప్పి బయటపెడితే ప్రాణం తీస్తాను అంటూ తండ్రి బెదిరింపులకు పాల్పడ్డాడు. కానీ బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లి మందలించడంతో   అసలు విషయాన్ని బయటపెట్టింది బాలిక. ఈ క్రమంలోనే  ఆ బాలికకు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా గర్భవతి అన్న విషయం తేలింది. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోక్సో  చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కీచక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: