ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఈ దారుణ ఘటన. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని హారదోయ్ లొ నరేంద్ర కమల అనే భార్య భర్తలు నివసిస్తున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. చిన్నప్పటినుంచి ఎంతో అల్లారుముద్దుగా కూతురుకి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. కూతురె ప్రపంచంగా బ్రతికే వారు ఆ తల్లిదండ్రులు. అయితే ఆమెకు 19 ఏళ్ళు వచ్చాయి ఇక ఇటీవల ఆ యువతి ఓ యువకుడితో పదే పదే ఫోన్ మాట్లాడుతూ ఉండడాన్ని తల్లిదండ్రులు గమనించి తీరు మార్చుకోవాలి అడ్డుకుంటామని హెచ్చరించారు.
అయినప్పటికీ ఆ యువతి మాత్రం తన ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూనే ఉంది. దీంతో కూతురి వల్ల ఎక్కడ పరువు పోతుందోనని భయం వారిలో నిండిపోయింది. ఇక పరువు కంటే కూతురు ఏం ఎక్కువ కాదు లే అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కన్న పేగు బంధాన్ని మరిచి కూతురిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ ప్రకారం కూతురిని హత్య చేసి ఇక మృతదేహాన్ని పొలంలో పడేసారు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే కూతురిపై ప్రియుడే అత్యాచారం చేసి హత్య చేశాడంటూ తల్లిదండ్రులు కొత్త నాటకానికి తెరలేపారు. ఇక అనుమానం వచ్చిన పోలీసులు తల్లిదండ్రులను తమదైన శైలిలో విచారించగా తను అసలు నిజం బయటపడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి