
ఇక స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు స్థానికుల సహకారంతో మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. చేపల లోడ్ తో వెళ్తున్న 14 టైర్ల భారీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి బోల్తా పడిందని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ ఘటనపై సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. లారీ విశాఖపట్నం జిల్లా దువ్వాడ నుంచి తాడేపల్లిగూడెం సమీపంలోని నారాయణపురం వెళ్తోందని, శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని తెలిపారు.
ఈ ఘటన సమయంలో లారీపై ఒక డ్రైవర్, ఇతర కార్మికులు సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. ఇక మృతిచెందిన వ్యక్తులు, గాయపడిన వారు ట్రక్కులో ఉండగా క్యాబిన్లో ఉన్న డ్రైవర్ ఇతరులు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. కాగా.. పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ప్రమాదంలో మృతుల వివరాలు ఇంకా తెలియాలేదు.