నేటి సమాజంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే రోజురోజుకు మానవమృగాలు పెరిగిపోతున్నాయ్ తప్ప మానవత్వం ఉన్న మనుషులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఏకంగా అడవుల్లో ఉండే మృగాల కంటే సభ్యసమాజంలో తిరిగే మనుషులు దారుణంగా ప్రవర్తిస్తున్నారూ. దీంతో మనుషులను చూస్తే ప్రాణ భయంతో వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితిలో ప్రతి ఒక్కరూ నేటి రోజుల్లో జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.


 లైంగిక దాడులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన ఎన్ని దారుణమైన శిక్షలు విధించినప్పుడు కూడా ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఇటీవల రాజస్థాన్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని డోల్ పూర్ లో ఓ దళిత మహిళ తన భర్త పిల్లలతో కలిసి పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొందరు దుండగులు వారిని అడ్డగించారు. ఇక సదరు మహిళ భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత బాధితురాలిని ఆమె పిల్లలను తుపాకీతో బెదిరించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు చివరికి అతికష్టం మీద పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.


 ఈ క్రమం లోనే బాధిత మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే అసలు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారంతా కూడా సదరు మహిళ గ్రామానికి చెందిన వారే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక మహిళ చెప్పిన వివరాల ప్రకారం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: