
ఆ మెసేజ్ ను క్లిక్ చెస్తె ఇక అంతే సంగతి. వాట్సాప్ కు లింక్ చేసిన నెంబర్స్ సంబంధించిన బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అవుతుందని అంటున్నారు. ప్రస్థుత కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా వాడుతున్నారు.ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్.. ఇలా రకరకాల యాప్స్ తెగ వాడేస్తున్నారు. చాలా మంది వీటిని వినియోగిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆ యాప్స్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. యాప్ సంస్థలు యూజర్ డేటా భద్రతకు ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ యూజర్ల. చూపును మార్చి కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు..
వాట్సాప్ యూజర్లకు ముందుగా వాయిస్ మెసేజ్ ను పంపిస్తారు.. అందులో ఒక మెయిల్ ను కూడా ఇస్తారు.సైబర్ నేరగాళ్ల కు సంబంధించిన ఒక ఇంఫొర్మెషన్ గల మాల్‌వేర్ ఆటో మేటిక్ గా ఇన్‌స్టాల్ అవుతుంది. దాని పై మనం క్లిక్ చెస్తె మన బ్యాంక్ ఖాతాకు సంబంధించిన పూర్తీ వివరాలు సైబర్ నేరస్తులు తెలుసుకోవడం జరుగుతుంది..28 వేల మందికి పైగా ఇలాంటి మెసేజ్ వచ్చిందని చెప్పారు. ఇటువంటి మెయిల్స్‌ను నమ్మవద్దని, వాటిని చూడగానే తొందర పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి వాటి నుంచి యూజర్లను కాపాడాలని వాట్సాప్ సరి కొత్త ఫీచర్లను అందుబాటు లోకి తెస్తున్నారు. మన జాగ్రత్తలో మనం వుండాలని పోలీసులు ఆదెసిస్తున్నారు..