మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తీసుకు వస్తున్న   కఠిన చట్టాలు కేవలం చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. మహిళపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులలో  మాత్రం ఎక్కడ మార్పులు తీసుకు రావడం లేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే రోజురోజుకు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టిన దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. దీంతో ప్రతిక్షణం ఆడపిల్ల భయపడుతూనే బతికే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆడపిల్ల ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది అంటే చాలు  మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అని పేరెంట్స్ భయపడే పరిస్థితి ఉంది అని చెప్పాలి.  మహిళలు మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తుంటే.. కామాంధులు మాత్రం వారిని వెనకడుగు వేసేలా చేస్తూనే ఉన్నారు.


 ఆడపిల్ల ఒంటరిగా కనిపించిందంటే చాలు ఇక మగాడిలో ఉండే మృగం బయటికి వస్తుంది. పశువుల మీద పడిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అభం శుభం తెలియని ఆడపిల్లలు కామపు కొరల్లో చిక్కుకొని బలి అవుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె మానసిక వైకల్యం ఉన్న ఒక దివ్యాంగురాలు. కానీ ఆమె పై కన్నేశారూ కామందులు.


 చివరికి దారుణంగా దివ్యాంగురాలు పై అత్యాచారం చేశారూ. సంగారెడ్డి లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఒక కాలనీకి చెందిన 20 ఏళ్ల దివ్యాంగురాలు తల్లిదండ్రులు చిన్నప్పుడు మరణించడంతో చిన్నమ్మ వద్ద ఉంటుంది. పుల్కల్ మండలం కి చెందిన రాములు అనే 48 ఏళ్ల వ్యక్తి ముఖుమ్ నగర్కు చెందిన చావుస్ అనే 65 ఏళ్ల వ్యక్తి  మానసిక దివ్యాంగుల యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: