సాధారణంగా దొంగలు ఏం చేస్తూ ఉంటారు.. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి ఒక రోజు రెక్కి నిర్వహించడం.. ఇక ఆ తర్వాత  ఎంతో చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతు ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలా ఇంట్లోకి చొరబడిన తర్వాత విలువైన వస్తువులు కళ్ళముందు ఏవి కనిపిస్తే అవి కాజేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరి కొంతమంది ఇటీవలి కాలంలో ఇంటి బయట ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగలించడమే పనిగా పెట్టుకున్నారు.


 ఇంకొంతమంది అటు రాత్రి సమయంలో రోడ్డుపై ఉంటూ ఇక వచ్చే పోయే వాహనదారులను బెదిరించి నిలువు దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు కూడా అందర్నీ భయపెడుతున్నాయి. ఇలా దొంగలు చిత్రవిచిత్రంగా చోరీలకు పాల్పడుతు ఏకంగా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం  అయితే గతంలో ఐరన్ బ్రిడ్జ్ ను దొంగలు చోరీ చేయడానికి ప్రయత్నించిన ఘటన సంచలనంగా మారిపోయింది. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.


 చిన్న చిన్న వస్తువులు ఎత్తుకెళ్ళడం కాదు ఏకంగా హై వోల్టేజి విద్యుత్ స్తంభాలను చోరీ చేయడానికి ప్రయత్నించారు ఇక్కడ దొంగలు. పంజాబ్లోని బరిందా జిల్లా లో ఈ ఘటన వెలుగు చూసింది. రాంపుర పూల్ లో రెండు 66kv హై వోల్టేజి విద్యుత్ స్తంభాలను చోరీ చేయాలని దుండగులు భావించారు. ఈ క్రమంలోనే కింది భాగంలో టవర్ల బోల్టులు  తొలగించారు. దీంతో ఒక్కసారిగా టవర్లు కుప్పకూలిపోయాయి. దీంతో ఇది చూసిన స్థానికులు భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. ఇక దొంగలు చేసిన పనికి అటువిద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది అన్న విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: