లవ్ మ్యారేజ్ చేసుకుంటే సుఖంగా ఉంటారా లేకపోతే ఆ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారా అంటే ఎలాంటి పెళ్లి చేసుకున్నామన్నది కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత జీవితంలో ఎంతలా భాగస్వామిని అర్థం చేసుకున్నాము అన్నదే ముఖ్యం అంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా అర్థం చేసుకోకపోవడం కారణంగానే నేటి రోజుల్లో ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి అనే చెప్పాలి. భార్య భర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలకే ఏకంగా అక్కడితో బంధాన్ని తెంచుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అంతే కాదండోయ్ భార్యాభర్తల బంధానికి కూడా ఎవరూ విలువ ఇవ్వడం లేదు.


 వెరసి ఏకంగా భార్యాభర్తలు కాస్త బద్ద శత్రువులు గా మారిపోయి ఒకరి ప్రాణాలు  ఒకరు తీయడానికి కూడా వెనుకాడని పరిస్థితి నేటి సభ్యసమాజంలో కనిపిస్తోంది. ఇక ఇటీవలే తరచు ఫోన్ మాట్లాడుతుందని అనుమానించడం మొదలు పెట్టాడు. తీరు మార్చుకోవాలని భార్యకు చెప్పాడు.. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్యను దారుణంగా గొంతునులిమి హత్య చేసిన  ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఎన్టిపిసి ఆటో నగర్కు చెందిన ఆజంఖాన్ అదే కాలనీకి చెందిన శ్రావణికి ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు.


 ఇద్దరి మతాలు వేరైనా కలకాలం సుఖంగా ఉంటాము అనే నమ్మకంతో వీరిద్దరు వైవాహిక బంధంలో పెద్దలను ఒప్పించి మరీ అడుగుపెట్టారు. ఇక పెళ్లయిన తర్వాత భార్య భర్త ఇద్దరూ శ్రావణి తల్లి నర్మదా ఇంట్లోనే కాపురం పెట్టారు. ఇక వీరికి ఒక కుమారుడు ఒక కూతురు కూడా ఉన్నారు. శ్రావణి కృష్ణా నగర్ లోని ఓ కార్పొరేట్ వ్యాపార సంస్థలో పని కి వెళుతుంది.  ఈరోజు ఫోన్లో మాట్లాడుతూ పనికి వెళ్ళడాన్ని గమనించిన  అజమ్ ఖాన్ కి అనుమానం వచ్చింది. ఫోన్ లో గంటలకు గంటలు మాట్లాడటం ఏంటి ప్రవర్తన మార్చుకో అంటూ భార్యకు చెప్పాడు. ఈ విషయంపై  శ్రావని అత్త నర్మద ఇద్దరు కలిసి అజంఖాన్ తో గొడవ పడ్డారు. గొడ్డలితో నరికి వేస్తాను అంటూ అజంఖాన్ బెదిరించడంతో శ్రావణి నర్మదా ఇద్దరు అతని ఇంట్లోకి లాక్కెళ్లి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: