సాధారణంగా వైద్యుల దగ్గరికి ఎన్నో రకాల రోగాలతో బాధపడుతున్న పేషెంట్లు తరచూ వస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమం లోనే ఇక ఎలాంటి వ్యాధితో డాక్టర్ల దగ్గరికి వచ్చిన డాక్టర్లకు మాత్రం పెద్దగా కొత్తగా ఏమీ అనిపించదు. రోజు చూసే పేషంట్లే కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఏకంగా సీనియర్ డాక్టర్లను సైతం నిర్గాంత పోయేలా  చేసే కొన్ని విచిత్రమైన కేసులు డాక్టర్ల దగ్గరికి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా కేసులను చూసి డాక్టర్లు సైతం ఒక్కో సారి ఆశ్చర్య పోతూ ఉంటారు.


 ఇక్కడ డాక్టర్లకు ఇలాంటి అనుభవమే ఎదురయింది అని చెప్పాలి. కనీసం ఆహారం తీసుకోలేని దీనస్థితిలో ఒక బాలిక ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలోనే పరీక్షలు నిర్వహించిన వైద్యలు ఆశ్చర్యపోయారు. ఏకంగా బాలిక పొట్ట నిండా వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన చైనాలో వెలుగు చూసింది అని చెప్పాలి. పిక అనే రుగ్మతతో బాధపడుతుంది ఓ బాలిక. ఈ రుగ్మత ఉన్నవారు మట్టి పేపర్లు లాంటివి తినడం చేస్తూ ఉంటారు.


 ఈ క్రమం లోనే సదరు మహిళా తన తలపై ఉన్న వెంట్రుకలను తానే తినడం అలవాటుగా మార్చుకుంది. ఎంతలా అంటే పొట్ట లో ఇతర ఆహారం పట్టడానికి చోటు లేనంతగా ఆమె తన వెంట్రుకలను తానే తినేసింది. అయితే ఆస్పత్రి లో చేరే సమయానికి ఆమె పూర్తిగా బోడి గుండుతో ఉండడం గమనార్హం. అయితే వైద్యులు పరీక్షలు చేయగా ఏకంగా పొట్టు నిండా వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారూ. సుమారు రెండున్నర గంటల పాటు ఎంతో కష్టపడి శస్త్ర  చికిత్స చేసి వెంట్రుకలను బయటకు తీశారు. అయితే జుట్టును ఆరగించే అలవాటు ఉన్నవారు ఏకంగా ప్రాణాలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri