ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులు కాదు ఏకంగా కనీస మానవత్వం లేని మృగాలేమో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సాటి మనిషికి ఏ చిన్న ప్రమాదం వచ్చినా కూడా అయ్యో పాపం అంటూ జాలి పడిన మనుషులే ఇక ఇప్పుడు సాటి మనుషుల ప్రాణాలను దారుణంగా తీసేయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ఆస్తులకు అంతస్తులకు విలువ ఇస్తున్నవారు.. మనుషుల మధ్య ఉన్న బంధాలకు మాత్రం అస్సలు విలువ ఇవ్వడం లేదు.


 వెరసి కొంతమంది ఏకంగా ఆస్తులు కోసం సొంత వారి ప్రాణాలనే దారుణంగా తీసేస్తూ ఉన్నారు. ఇంకొన్ని ఘటనల్లో చిన్న చిన్న కారణాలకే ముక్కు ముఖం తెలియని వారిపై దాడి చేసి చివరికి ప్రాణాలు గాల్లో కలిపేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు భయంగానే బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు వచ్చి ప్రాణాలు తీస్తారో అనిభయాందోళనలో ఉంటున్నారు. ఇకపోతే ఇక్కడ మరో దారుణ హత్యలకు సంబంధించిన ఘటన వెలుగు చూసింది. ఏకంగా పొలంలో పని చేసుకుంటున్న ఇద్దరు తోటి కోడళ్లను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. కర్నూలు జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓర్వకల్ మండలంలోని నన్నూరులో రామేశ్వరి, రేణుక అనే తోడికోడళ్ళు హత్యకు గురయ్యారు. ఇద్దరు తోటి కోడళ్లు కూడా పొలంలో పని చేసుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఇద్దరి గొంతు కోసి కిరాతకంగా హత మార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇక వివరాలను సేకరించారు. అయితే ఓకే కుటుంబంలో ఇక ఇద్దరు దారుణ హత్యకు గురికావడంతో ఏకంగా స్థానిక గ్రామాలు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయ్. కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: