ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే నవ మాసాలు బరువు అనుకోకుండా మోయటమే కాదు భరించలేని నొప్పిని సైతం ఆనందంగా భరిస్తూ పిల్లలకు జన్మనిస్తూ ఉంటుంది తల్లి. అంతేకాదు ఇక ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలే సర్వస్వం అనుకుని జీవితాన్ని మొత్తం ధారబోస్తుంది. పిల్లలు ఎంత పెరిగి పెద్దయిన కూడా ఆ తల్లికి మతంమాత్రం చిన్నపిల్లల్లా గానే కనిపిస్తూ ఉంటారు. ఇలా తన కడుపున పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ప్రయోజకులు అయ్యారా లేదా అని స్వార్ధంగా ఆలోచించకుండా పిల్లలు ఎలా ఉన్నా ఒకే రీతిలో ప్రేమ కురిపిస్తూ ఉంటుంది  తల్లి. అందుకే ఈ లోకంలో అన్ని రకాల బంధాల్లో ప్రేమలు కల్మషం అయినప్పటికీ ఒక తల్లి ప్రేమ మాత్రం ఇంకా కల్మషం కాలేదు అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటన చూసిన తర్వాత మాత్రం తల్లి ప్రేమ కూడా కల్మషం అయ్యిందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే ఏకంగా కడుపున పుట్టిన పిల్లలను కంటికి రెప్పలా కాచుకోకుండా.. దారుణంగా ప్రవర్తించింది తల్లి.


 కానీ ఇక్కడ తల్లి మాత్రం ఏకంగా విధంగా కడుపున పుట్టిన పిల్లలని వదిలించుకోవాలని ప్రయత్నించింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటు చేసుకుంది అని చెప్పాలి. అప్పుడే పుట్టిన మగ శిశువును ఓ మహిళా సంచిలో కట్టి తహసిల్దార్ ఆఫీస్ వద్ద వదిలి వెళ్లింది. సంచిని పందులు లాక్కెళ్తుండగా శిశువు ఏడుపు విన్నారు స్థానికులు. ఈ క్రమంలోనే శిశువును కాపాడి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును ఎవరు వదిలి వెళ్లారు అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: