ఈ క్రమంలోనే ఇలా దళిత బంధు పథకంలో అర్హులుగా ఉన్న వారికి పది లక్షల రూపాయలు ఇవ్వడం కూడా చేస్తూ ఉంది. మొదట్లో కేవలం కొన్ని ప్రాంతాలకే దళిత బంధు పరిమితం చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఈ పథకం వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దళిత బంధు విషయంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. నిజమైన అర్హులకు కాకుండా కేవలం పార్టీ శ్రేణులకు మాత్రమే దళిత బంధు దక్కుతుంది అంటూ ఎంతో మంది పెదవి విరుస్తూ ఉన్నారు. ఇంకొంతమంది అసలైన నిరుపేదలకు ఇక దళిత బంధు అందడం లేదు అని ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ ఆరోపణలు నిజమే అని నిరూపించే ఘటన.. ఇటీవల జగదేవ్పూర్లో వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా అయితే ఊరిలో ఎక్కువ దళిత కుటుంబాలు ఉంటే ఎవరో ఒకరికి దళిత బంధువు వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆ ఊరిలో ఒకే ఒక దళిత కుటుంబం ఉంది. కానీ దళిత బంధు దక్కలేదు. వారికి గుంట జాగలేదు.. కనీసం సరైన ఇల్లు కూడా లేదు.. కూలి చేస్తేనే పూట గడిచే పరిస్థితి. అయినప్పటికీ ఆ కుటుంబం దళిత బందుకు నోచుకోలేదు. జగదేవ్పూర్ మండలం కొత్తపేట దళిత కుటుంబం బాల నరసింహ, సత్తమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూతుర్ల పెళ్లిలు అయ్యాయి. అయితే చిన్న కూతురు సరిత బిఈడి చేసి జగదేకపూర్ లో ప్రైవేట్ టీచర్ గా పని చేస్తుంది. తల్లి కూలీ పనులు చేస్తే తండ్రి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. అయితే ఊరిలో వీరి ఒక్కరిదే దళిత కుటుంబం. అయినా రైతుబంధు మాత్రం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి