తాజాగా కోకాపేట అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రతి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి భూములు ఇవ్వడం అనేది సాధారణంగా జరిగే అంశం. ఇంతకుముందు గాంధీ భవన్ అయినా.. టీఆర్ఎస్, టీడీసీ ఆఫీసులకు స్థలాలు కేటాయించారు. అయితే ఇంకో స్థలం కావాలనుకుంటే ఉన్నది సరెండర్ చేసి మరో చోట స్థలాన్ని పొందాలి. కానీ బీఆర్ఎస్ సంబంధించినంత వరకు ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ భవనం కాకుండా కోకాపేటలో రూ.50 కోట్లకు సంబంధించిన భూమిని రూ. మూడున్నర కోట్లకే కేటాయించిందని పోరం ఫర్ రిఫర్మ్ అనే సంస్థ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై వారు హై కోర్టులో కేసు వేశారు.
దీనిపై ఇప్పటి వరకు ఏ పార్టీ మాట్లాడటం లేదు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లాంటి వారు కూడా ఈ భూముల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంత భూమి కేటాయింపు జరిగిన కూడా ఈ పార్టీలకు విషయం తెలియదా? లేదా తెలిసి కేసీఆర్ ను ఏమీ అనకూడదని నిర్ణయం తీసుకున్నారా.. లేక రాజకీయ పార్టీగా అక్కడ తమ పార్టీకి కూడా భూమి వస్తుందని విమర్శలు చేయడం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తోడు దొంగల తీరు అన్నట్లు అధికార పక్షం రూ.50 కోట్ల భూమిని మూడున్నర కోట్లకే విక్రయిస్తే దాన్ని ప్రశ్నించడానికి కూడా ఎవరూ సాహసం చేయలేదంటే దీని వెనక ఏదో మతలబు ఉందని అనుమానాలు కలగక మానవు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి