
మోదీ ప్రధాని అయినప్పటి నుంచి తన ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నారు. మోదీ ప్రస్తుత ఆస్తి రూ.2.58 కోట్లు. గతేడాదితో పోలిస్తే రూ.35 లక్షలు పెరిగాయి. మార్చి 31 న ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆయన సమర్పించిన ఆస్తి విలువ రూ.2,58,96,444. గతేడాదితో పోల్చితే 15.69 శాతం పెరుగుదల కనిపించింది. ఆయన పేరున కొంత నగదు, బ్యాంకులో ఫిక్స్ డ్, మల్టీ ఆప్షన్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్ ధ్రువపత్రాలు, 4 బంగారు ఉంగరాలు తప్ప మరే ఇతర స్థిర, చరాస్తులు లేవు. గతేడాది ఎల్ఐసీ పాలసీలు చూపినా ఈ సారి వాటి గురించి చెప్పలేదు. ఆయన ఆస్తులు 95.55 శాతం గుజరాత్ లోని గాంధీ నగర్ లోని ఎస్బీఐ ఎన్ఎస్సీ బ్రాంచ్ లో ఎఫ్డీఆర్, ఎంవోడీల రూపంలో ఉంది.
గత సంవత్సరంతో పోలిస్తే దీని విలువలో 17.64 వృద్ధి నమోదైంది. మరో ఖాతాలో నగదు నిల్వ రూ. 46 వేల కనీస నగదు నిల్వ రూ.574కు తగ్గిపోయింది. సతీమణి జసోదాబెన్ పేరున ఉన్న ఆస్తి వివరాలు తెలియవని మోదీ పేర్కొన్నారు. అయితే ఈ ఆస్తుల పెరుగుదలపై ప్రతిపక్షాలు ఏమైనా విమర్శిస్తాయో చూడాలి. పెరిగిన రూ. 35 లక్షలను మోదీకి అదానీ ఇచ్చారు అని అంటేరేమో.