
మరే ఇతర పార్టీ అయినా సరే మళ్లీ అధికారంలోకి వస్తే వీటిని కొనసాగిస్తామని చెప్తారు. కానీ మోదీ అలా చేయలేదు. గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన దేశవ్యాప్తంగా చేపట్టిన వెనుకబడిన ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం ఎంతో మార్పు తెచ్చింది. దాని ఆధారంగా 100 ఆకాంక్షిత తాలుకాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తామని, వచ్చే ఏడాది మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబరు, నవంబరు లో ఈ సమీక్ష చేస్తానని స్పష్టం చేశారు. ఆకాంక్షిత జిల్లాల్లోని మండలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేపట్టే సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో దాదాపు 3000 మంది గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరో 2 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 112 జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల 25 కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాలు నేడు స్ఫూర్తిమంతమైన జిల్లాలుగా అవతరించాయి. ఇదే స్ఫూర్తితో రానున్న ఏడాదిలో 500 జిల్లాలోని 100 మండలాలను ఎంపిక చేసి అభివద్ధి చేయాలని మంత్రిత్వ శాఖలకు సూచిస్తున్నా అని చెప్పారు. మళ్లీ నేనే వచ్చి సమీక్ష నిర్వాహిస్తామని చెప్పడం అహంకారం అని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని అందుకే మోదీ ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.