ఎవరి వ్యక్తిగత జీవితాలు వారివి. వాటిని రాజకీయాల్లో భాగం చేయకూడదు. పవన్ విషయానికొస్తే జగన్ పదే పదే మూడు పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఈ పెళ్లిళ్లు వాళ్ల ఇష్ట పూర్వకంగానే చేసుకున్నారు తప్ప ఒకరికి తెలయకుండా మరొకరని చేసుకొని ఎవర్నీ మోసం చేయలేదు. విడిపోయిన భార్యలు కూడా తమకు అన్యాయం జరిగింది అని బహిరంగ ప్రకటనలు చేయలేదు. ఎవరి జీవితాలను వారు గడుపుతున్నారు. అయితే వ్యక్తిగత విమర్శలుకు వెళ్తే పవన్ అభిమానులు నియంత్రణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. తద్వారా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత తదితర అంశాలు పక్కదారి పడతాయని జగన్ భావించి ఉండవచ్చు.
కానీ పవన్ మాత్రం చాలా తెలివిగా వ్యవహరించారు. దీనిపై ఎలాంటి ప్రతి విమర్శలు కానీ.. పరుష పదజాలం కానీ ఉపయోగించలేదు. పవన్ కానీ అతని అభిమానులు కానీ ఆవేశంగా మాట్లాడతారు కానీ ఆలోచించరు అనే అపవాదు ఉండేది. నాగబాబు రంగంలోకి దిగాక సంస్థాగతంగా పార్టీని వ్యవస్థీకృతం చేయగలిగారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడే విధానానికి స్వస్తి పలికేలా చేశారు.
చంద్రబాబు విషయంలోను వయసు విషయం ప్రారంభంలో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది. అవినీతికి వయసుతో పని ఏముంది.. 40సంవత్సరాల అనుభవం వంటి వాటిని ప్రచారంలోకి తీసుకురాకుండా అన్యాయంగా అరెస్టు చేశారు అనే దానిని హైలెట్ చేశారు. దీంతోపాటు జగన్, వైసీపీ నేతలు దమ్ముంటే ఒంటరిగా పోటీకి రండి అని టీడీపీ, జనసేనలకు సవాల్ విసిరి తన ట్రాప్లోకి తెచ్చుకునేందుకు యత్నించారు. కానీ పొత్తుతోనే వస్తాం అని చెప్పి జగన్ ట్రాప్ లో పడకుండా జనసేన టీడీపీ నేతలు తెలివిగా వ్యవహరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి